Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-తుర్కపల్లి
గ్రామాల రూపురేఖలు మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న రీతిలో ప్రణాళికలు చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు . ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన మండలంలోని వాసాలమర్రి గ్రామంలో సోమవారం సభ ప్రాంగణాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసే ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు, అటవీ భూములను ప్రభుత్వం భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి అని పూర్తి నివేదికలో రేపు సిద్ధం చేసి అధికారులు సభ ముందు ఉంచాలని తెలిపారు. ముఖ్యమంత్రి గతంలో ఎర్రవల్లి గ్రామాన్ని విధంగానైతే అన్ని రంగాల్లో అన్ని కులాల వారికి లబ్ది చేకూర్చారని అదే విధంగా వాసాలమర్రి గ్రామం కూడా అన్ని హంగులతో అన్ని రంగాల్లో ప్రతి కుటుంబానికీ లబ్ది చేకూర్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. రైతు బంధు, రుణమాఫీ, కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ అనేక సంక్షేమ ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందే విధంగా పార్టీలకతీతంగా రాజకీయాలకతీతంగా గ్రామంలో అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలోనే వాసాలమర్రి గ్రామం ఆదర్శంగా అన్ని గ్రామాలకు అందరూ అభివద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామసభ నిర్వహించి గ్రామస్తుల అభిప్రాయాల మేరకు అవసరాల మేరకు పనులను చేపడ్తారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లై చైర్మెన్ మా రెడ్డి డి.శ్రనివాస్ రెడ్డి, టీఎస్ఐసీసీ చైర్మెన్ గ్యాదరి బాలమల్లు, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్, ఎంపీటీసీ పలుకుల నవీన్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మెన్‌్ గడ్డమీది రవీందర్ గౌడ్, టీిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పడాల శ్రీనివాస్ ,నాయకులు నరేందర్ రెడ్డి, నరసింహులు, నాయకులు సర్పంచులు మల్లేశం ,సురేష్ నాయక్, లలిత శ్రీనివాస్, సత్యనారాయణ, పార్టీ నాయకులు జిల్లా అధికారులు, మండల స్థాయి అధికరులు పాల్గొన్నారు.