Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
కులాలీ వారీగా ఉపాధికూలీలకు వేతనాలివ్వాలని కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన మెమోను వెనక్కు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ప్రధా కార్యదర్శి నారి అయిలయ్య, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి కుర్ర శంకర్‌నాయక్ డిమాండ్ చేశారు.సోమవారం ఆయా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు ప్రత్యేక ఫండ్ పేరుతో గ్రామీణాభివద్ధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన మెమోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఉపాధి హామీ కార్మికులను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతరులు అని వర్గీకరించాలని కేంద్ర గ్రామీణాభివద్ధి శాఖ ఇచ్చిన ఉత్తర్వులు దారుణమన్నారు.ఒకే వేతనానికి అర్హత ఉన్న కార్మికులను వివిధ కులవర్గాలుగా విభజించడానికి ఎటువంటి హేతుబద్ధత లేదన్నారు.ఇది వేతనాల చెల్లింపును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు.చెల్లింపు పద్ధతి మారినప్పుడల్లా చెల్లింపుల్లో ఆలస్యానికి కారణమవుతుందన్నారు.సంక్లిష్టమైన చెల్లింపు ప్రక్రియను సరళీకతం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ప్రభుత్వం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.కేంద్ర గ్రామీణాభివద్ధి శాఖ ఉత్తర్వులు ఉపాధిహామీ చట్టం ప్రాథమిక అవగాహనతో పాటు సమాన వేతనాల చట్టాన్ని ఉల్లంఘిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉపాధి కార్డుదారులను ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల లింక్పేరుతో బైబర్కేషన్ చూస్తూ వేతనాలివ్వడంతో జాప్యం లేకుండా పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు.కేంద్ర చట్టవిరుద్ధమైన ఈ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని కోరారు.అన్ని కుటుంబాలకు సకాలంలో వేతనాలు చెల్లించడంతో పాటు 200 రోజుల పని కల్పించి రోజుకు రూ. 600 ఇచ్చేందుకు బడ్జెట్ కేటాయింపులు చేయాలని కోరారు. కరోనా కాలంలో ప్రతి కుటుంబానికి రూ.7500 చెల్లించాలని కోరారు.కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండ శ్రీశైలం, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బొజ్జవెంకులు, కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెమడాల పరుశరాములు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ ,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు దండెంపల్లి సరోజ,ఆకుల వెంకట్రాం, కత్తులలింగస్వామి, రవినాయక్, కేవీపీఎస్ జిల్లా నాయకులు గాదె నర్సింహ, గండమల్ల రాములు, బొల్లురవీందర్, మంజుల, పెరిక కష్ణ, లూర్దు మారయ్య, గుడుగుంట్ల రామకృష్ణ, రెమిడాల భిక్షం, శివ పాల్గొన్నారు.