Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిండి ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-డిండి
డిండిప్రాజెక్టు క్రింద ఉన్న ప్రతి ఎకరాకు నీరందిస్తామని, ప్రతి ఇంటికీ తాగునీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు.సోమవారం వానాకాలం పంటకు డిండిప్రాజెక్టు నీటిని ఆయన విడుదల చేసి మాట్లాడారు. అనంతరం రైతు వేదిక, శ్మశానవాటికలను ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ యోజక వర్గాన్ని సస్యశ్యామలం చేయడం తన ముఖ్యోద్దేశమన్నారు. ప్రభుత్వం సాగు, తాగునీటికి ప్రధాన్యత ఇస్తుందని, డిండి ఆయకట్లు కింద ప్రతి ఎకరాకు సాగునీరు, నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీరందిస్తున్నట్టు తెలిపారు.దేశంలో రైతుల గౌరవాన్ని పెంచిన ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాధవరం సునీతజనార్దన్రావు, జెడ్పీటిసీ మాధరవం దేవేందర్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మెన్ శిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య, పీఏసీఎస్ చైర్మెన్లు తూం నాగార్జున్‌రెడ్డి, శ్రీనివాసరావు, తహసీల్దారు పుష్పలత, ఎంపీడీఓ గిరిబాబు, డీఈ శ్రీనివాసులు, ఈఈ శ్రీధర్‌రావు, సర్పంచ్ మేకల సాయమ్మకాశన్న, ఉపసర్పంచ్ నూకం వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు బుశిపాక వెంకటయ్య,ఎ.రాధికకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, భగవంత్‌రావు, వెంకటయ్య, గోపాల్‌రావు, శ్రీను, కృష్ణ, కలీమ్, విష్ణు పాల్గొన్నారు.