Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
రాష్ట్ర ప్రభుత్వ వివిధశాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ 11వ పీఆర్సీ కమిషన్ సిఫారసు ప్రకారం 3 కేటగిరీలలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు రూ.19వేలు, రూ.22,900, రూ.31040 పెంచాలని ప్రభుత్వ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు దుబ్బపరమేశ్, పెరుమాళ్ల సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సీహెచ్. లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ ముందు ఫ్లకార్డులతో ధర్నా నిర్వహించారు.ఏవో మోతీలాల్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 87 లక్షల కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు సేవలందిస్తున్న ఈ ఉద్యోగుల శ్రమను గుర్తించకపోవడం సరికాదన్నారు.కాంట్రాక్ట్,అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్న ప్రభుత్వం చేయకపోగా వేతనాలను హేతుబద్ధంగా పెంచకపోవడం దారుణమన్నారు.9వ పీఆర్సీకి, పదో పీఆర్సీకి మధ్య 50 శాతం పెరుగుదల ఉండగా ఇప్పుడు ఉన్న వేతనంపైన 30 శాతం నిర్ణయించడం విడ్డూరంగా ఉందన్నారు.ఈ కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు ఇంటి కిరాయి, విద్య, వైద్యం ఖర్చులు భారీగా పెరిగాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జీఓ 60ను సవరించి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల కాంట్రాక్ట్,అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎస్.వినోద్, స్వప్న, కిరణ్, విజయ, రవి, లక్ష్మీ, సునీత, రాధా, నాగలక్ష్మి,అనిత, జ్యోతి, నూర్జహాన్, ధనలక్ష్మీ పాల్గొన్నారు.