Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చందంపేట
ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం నేరేడుగొమ్ము మండలం వైజాగ్‌కాలనీ సాగర్ బ్యాక్‌వాటర్‌లో చోటుచేసుకుంది.ఎస్సై సతీష్ తెలిపిన వివరాలప్రకారం..హైదరాబాద్ చైతన్యనగర్ బీఎన్.రెడ్డికాలనీలో నివాసముంటున్న పొన్న క్రాంతికుమార్, పూలే దామోదర్, కొత్తపల్లి సుజీత్‌రెడ్డి ప్రవీణ్‌రెడ్డి యువరాజు హైదరాబాద్ నుండి వైజాగ్‌కాలనీ పర్యాటక ప్రాంతాన్ని సందర్శించేందుకు ఆదివారం వచ్చారు. తమిత్రులందరూ సరదాగా ఫొటోలు దిగి వీడియోలు తీసుకున్నారు.అప్పటికే సాయంత్రం ఆరుగంటల సమయం కావడంతో తిరుగు ప్రయాణం అవుదామనుకున్న సమయంలో క్రాంతికుమార్(25)సాగర్ బ్యాక్‌వాటర్‌లో పక్కనే ఆగి ఉన్న బోటు దగ్గరికి వెళ్దామని తోటి మిత్రులకు చెప్పాడు.వారు తమకు ఈత రాదని చెప్పారు.తోటి మిత్రులు వెళ్లవద్దని చెప్పినా వినకుండా తనకు ఈత వచ్చొంటూ బోటు దగ్గరికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో అలసిపోయాడు.ఎదురుగా ఈదురుగాలులు వీయడంతో శ్వాసఆడక నీట మునిగాడు.విషయం గమనించిన తోటి మిత్రులు వాళ్లకు ఈత రాకపోవడంతో దగ్గరలో ఉన్న మత్స్యకారులను పిలిపించుకుని వచ్చే సమయంలోపు యువకుడు మునిగిపోయాడు.విషయం తెలుసుకున్న సర్పంచ్ ఎస్సైకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు.ఎస్సై తన సిబ్బందితో సంఘటనా స్థలనాకి చేరుకున్నారు.ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఫోన్లో మృతదేహాన్ని వెంటనే తీసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో ఎస్సై సతీష్ గజ ఈతగాళ్లతో సోమవారం ఉదయం మృతదేహాన్ని వెలికితీయించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియాస్పత్రికి తరలించారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.