Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మోటకొండూర్
గంధమల్ల రిజర్వాయర్ ద్వారా ఆలేరు నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగునీరు అందించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బొలగాని సత్యనారాయణ , మండల కార్యదర్శి గదేగాని మాణిక్యం అన్నారు. సోమవారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో ఆ పార్టీ మండల సహాయ కార్యదర్శులు మూసుకు పెంటరెడ్డి, ఆలేటి బాలరాజు, మండల కౌన్సిలర్లు కార్యవర్గం పల్లె వెంకన్న, నల్ల ప్రదీప్ రెడ్డి ,సుధాగానే వెంకన్న, పల్లె శీను నల్ల రాములు బీరకాయల మల్లేష్ కొల్లూరు మల్లేష్, గణేష్, పాండు, భాగ్యమ్మ, గుమ్స్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : గంధమల ప్రాజెక్టును నిర్మించి సాగునీరందించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ , వేరే పురాణములు మండల పట్టణ కార్యదర్శులు చవుడబోయిన కనకయ్య, గొట్టి పాముల శ్రీనివాస్ , తెడ్డు ఆంజనేయులు ,బొడ్డు ఆంజనేయులు, పరుశరాములు పాల్గొన్నారు.
గుండాల : గంధమల్ల రిజర్వాయర్ ద్వారా గుండాల మండలానికి సాగునీరు అందించాలని కోరుతూ సీపీఐ ఆద్వర్యంలో సోమవారం తహసీల్దార్ ఉల్ఫాల దయాకర్ రెడ్డికి వినతిపత్రంఅందజేశారు. వినతి పత్రం అందజేసినవారిలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కుసుమాని హరిచంద్ర ,మండల కార్యదర్శి అనంతుల రాంచంద్రయ్య ,నరముల సోమన్న నర్సయ్య ఉన్నారు.
బొమ్మలరామరం: కొండపోచమ్మ ప్రాజెక్టు నుండి మండలానికి సాగు, తాగునీరందించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఆ పార్టీ మండల కార్యదర్శి అన్నేమైనా వెంకటేశం, నాయకులు పల్లపు మల్లేష్, పిట్టల శంకర్ ,వడ్లకొండ భారతమ్మ ,తుమ్మల జహంగీర్, జయమ్మ, పొన్నాల మాదేవి, శ్రీకాంత్ ,పిల్లికుంటతండ ధీరావత్ విట్టర్ నాయక్, ఆగమయ,్య మురళి, వేణుగోపాల్ ఉన్నారు.