Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
పట్టణంలోని హౌజింగ్‌బోర్డులోని లిటిల్‌ఫ్లవర్ స్కూల్లో సోమవారం యోగా డేను నిర్వహించారు.యోగా ట్రైనర్ వినోద్ చంద్రన్ ఆధ్వర్యంలో పాఠశాల చిన్నారులకు ఉచితంగా యోగా నేర్పించడంతో పాటు, యోగా ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.ప్రతి ఒక్కరూ నిత్యం ఉదయం సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్నిసాధించొచ్చని ప్రిన్సిపాల్ జయరాజన్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవికుమార్, ఉషారాణి, జహంగీర్ పాల్గొన్నారు.
చిట్యాల :బీజేపీ పట్టణ అధ్యక్షులు కురెళ్ల శ్రీను ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుదర్శన్,పల్లె వెంకన్న, జిట్టా క్రిష్ణ, ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్, ఉపాధ్యక్షులు పాల రవివర్మ, కంభంపాటి సతీష్,బీజేవైఎం అధ్యక్షులు నీల నరేష్,ఉపాధ్యక్షులు నుకేష్, మైనార్టీ అధ్యక్షులుసలీంబారు, నక్క నవీన్, నరేష్,విక్రమ్, సతీష్ పాల్గొన్నారు.
చండూర్ :మండలంలోని పుల్లెంల గ్రామంలో పుల్లెంల గ్రామ యువక మండలి ఆధ్వర్యంలో మాజీ పీఏసీఎస్ చైర్మెన్ బోబ్బిలి శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో యోగా దినోత్సవం నిర్వహించారు. యోగ గురువులు బుతరాజు నిరంజన్ .జక్కలి స్వామి లు వివిధ రకాల యోగ ఆసనాలు చేసి యోగ యొక్క విశిష్టత దైనందిన జీవితంలో యోగ యొక్క ప్రాధాన్యం శారీరక మానసిక ఆర్యోగ్యాల పట్ల యోగ చూపే ప్రభావం గురించి వివరించారు.
యోగాతో ఆనందం ఆరోగ్యంగా ఉండవచ్చని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి అన్నారు.జిల్లాకేంద్రంలో ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సత్యసాయి ధ్యానమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు.ఈ సందర్భంగా నిత్య యోగ సాధకులు చేసిన యోగాసనాలు, సాంస్కతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్‌రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, నాయకులు యాదగిరాచారి, పల్లబోయిన శ్యాంసుందర్, భవానీ ప్రసాద్, సత్యసాయి ధ్యానమండలి గౌరవ అధ్యక్షుడు ఇడుకుల నరసింహ, ముఖ్య సలహాదారుడు కంది భజరంగ్ ప్రసాద్, అధ్యక్షుడు లోడంగి గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి ఇదికోజు శ్రీనివాసాచారి, కోశాధికారి బ్రహ్మచారి, లింగారెడ్డి, చిలుముల నరేందర్, గుర్రం చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.అనంతరం యోగా గురువులు రాపోలు వెంకటేశ్వర్లు, శంకరయ్య, వెంకట్‌రెడ్డి, జ్యోతి, శివ, వెంకటేశ్వర్లు, పర్యావరణ ప్రేమికుడు మిట్టపల్లి సురేష్‌గుప్తా, అన్నపూర్ణ సేవా సమితి నిర్వాహకుడు శ్రీకాంత్‌లను ఘనంగా సన్మానించారు