Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
మలిదశ తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం నేత తిరుమల్ కొండల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఉజ్వల రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు నాగరాజు గౌడ్ , తెలంగాణ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లగొండ అంజి డిమాండ్ చేశారు. సోమవారం మండలకేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి వారు పూలమాలలేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి , మాదగోని నరేందర్‌గౌడ్, బీజేపీ దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్గూరి రమేశ్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పందుల మల్లేష్, నియోజవర్గ ప్రచార కార్యదర్శి బండారు యాదయ్య, తెలంగాణ ఉద్యమ నాయకులు మాల్గి యాదయ్య, కాంగ్రెస్ నాయకులు పందుల పర్వతాలు, పందుల అశోక్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పందుల సంపత్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నియోజవర్గ ఇన్చార్జి సునీల్, సులేమాన్, టీఎస్‌యూ మండల అధ్యక్షుడు పందుల సురేష్, సీనియర్ నేత దుబ్బ జెల్లయ్య పాల్గొన్నారు.