Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిడమనూరు
దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయని అధిక ధరలు తగ్గించలేని మోడీ ప్రభుత్వం దిగిపోవాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు కొండేటి శ్రీను డిమాండ్ చేశారు.వామపక్షాల పిలుపు మేరకు సోమవారం మండలకేంద్రంలో మిర్యాలగూడ-దేవరకొండ ప్రధాన రహదారిపై ట్రాక్టర్కు తాళ్లు కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని ప్రజల సంపదను పెట్టుబడిదారులకు నిట్టనిలువునా దోచి పెడుతుందన్నారు.ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా కారుచౌకగా అమ్మి వేసిందన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు కోమాండ్ల గురవయ్య ,నల్లబోతు సోమయ్య, కుంచం శేఖర్, వింజమూరి శివ, వింజమూరి పుల్లయ్య, కోమాండ్ల ఆంజనేయులు, ముత్యాల కేశవులు, సత్యం, వెంకన్న, రిమానగోటి రాములు పాల్గొన్నారు.