Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లూరు రాజయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో బుధవారం టీఎన్జీవో భవనం ఆవరణలో వామపక్ష పార్టీల రైతు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26న రాష్ట్ర గవర్నర్ తమిళసైకి వినతిపత్రం అందజేస్తామన్నారు . చలో కలెక్టరేట్ కార్యమ్రం నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లా కేంద్రంలో జరిగే ధర్నా కార్యక్రమానికి వామపక్ష పార్టీల , రైతు సంఘాల నాయకులు రైతులు తరలి రావాలని పిలుపునిచ్చారు .ఈ సమావేశంలో రైతు సంఘాల నాయకులు కల్లెపు అడవయ్య, కొమరయ్య, చక్క వేంకటేశు ,ఆర్ జనార్దన్ ,పిక్క గణేష్ , సుంచు దేవయ్య ,గొట్టిపాముల శ్రీనివాసు, తదితరులు పాల్గొన్నారు .