Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాను దత్తత తీసుకొని ఉంటే బాగుండేది
- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్‌రెడ్డి
నవతెలంగాణ -భువనగిరి రూరల్
యాదాద్రి భువనగిరి జిల్లాలో జీపీలకు రూ.25లక్షల చొప్పున నిధులు కేటాయించడం అభినందనీయమని, జిల్లా మొత్తం దత్తత తీసుకుని అభివద్ధి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు మూడు రోజుల క్రితం వివిధ పత్రికలు ముఖ్యంగా విన్నవించగా సీఎం స్పందించి , వాసాలమర్రి గ్రామానికి, భువనగిరి మున్సిపాలిటీకి కోటి రూపాయలు, ఇతర మున్సిపాలిటీలకు 50 లక్షలు, గ్రామ పంచాయతీలకు 20 లక్షలు కేటాయించడం అభినందనీయమని పేర్కొన్నారు. భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి మూసీ ప్రక్షాళన, రైతులకు సాగు, తాగు నీరు అందిస్తే జిల్లా ను పూర్తి స్థాయిలో అభివద్ధి చేసినట్టు అవుతుంది పేర్కొన్నారు. బునాదిగాని కాల్వ , ధర్మారెడ్డి పల్లి, బొల్లేపల్లి కాల్వలను పూర్తి చేయాలని కోరారు. బస్వాపురం రిజర్వాయర్ తోపాటు గంధ మల్ల ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా క తలమానికమైన టువంటి, రాష్ట్రానికి గుర్తింపు తెచ్చే ఏయిమ్స్‌లో బిల్డింగ్స్‌ను పూర్తి చేసి కేంద్రానికి అప్పగించాలని, హాస్పటల్లో సేవలు ప్రారంభించేలా చూడాలని కోరారు. సీఎం ఇచ్చిన హామీలు నీటి మూటలుగా కుండా చూడాలన్నారు.సీఎం కేసీఆర్ ఎప్పుడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శిస్తూ ఉండాలని, స్వామి వారి దేవాలయం పట్ల ఉన్న దష్టి జిల్లాపై కూడా ఉండాలని పేర్కొన్నారు.