Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరురూరల్
అనుమానాస్పదస్థితిలో వృద్ధుడు మృతిచెందిన సంఘటన బుధవారం మండలంలోని గొలనుకొండ ఆవాస గ్రామమైన వంఛగూడెంలో చోటుచేసుకుంది. యాదగిరిగుట్ట రూరల్ సీఐ జి.నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం... వంచ గూడెం గ్రామానికి చెందిన సామల వీరారెడ్డి(70), కుమారుడు,కోడలు, మనుమడు, మనుమరాలు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. మతునికి 6 ఎకరాల20 గుంటల భూమి ఉండగా 3ఎకరాలు కొడుకు ప్రభాకర్ రెడ్డికి పట్టా చేశాడు. మిగిలిన3 ఎకరాల 20గుంటల భూమిని తన పేరు మీద చేయాలని మనుమడు నరేందర్ రెడ్డి తాత వీరా రెడ్డి మీదకి గొడవ చేశాడు. బుధవారం ఉదయం వీరారెడ్డి చేయి ,తొడ,చాతి పైగాయలై బాత్రూంలో రక్తం మడుగులో పడిఉన్న వీరా రెడ్డిని చూసి కుమారుడు ప్రభాకర్ రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో నమూనాలు సేకరించారు. మతదేహాన్నీ పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వృద్ధుని మృతిపై అనుమానాలు ఉన్నాయిని తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. సీఐ వెంట ఆలేరు ఎస్సై ఎండి .ఇద్రిస్ ఆలీ,మోటకొండూర్ ఎస్సై నాగరాజు, ఆలేరు ఏఎస్సై యుగేందర్, పోలీసు సిబ్బంది సైదులు, నరేష్, తదితరులు ఉన్నారు.