Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కపల్లి
ముఖ్యమంత్రి చేసిన అభివద్ధి పనులను చూసి ఓర్వలేక పనిలేని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి సభలో యాదాద్రి జిల్లాలో 421 గ్రామాలు పంచాయతీ మున్సిపాలిటీ నిధులు మంజూరు చేయడం జిల్లా వాసుల అదష్టన్నారు. దీనిని ఓర్వలేక ప్రతిపక్షాలు ధర్నాలు ఆలేర్ నియోజకవర్గానికి ఎంపీ కోమటిరెడ్డి వెంక్రెడ్డి ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడం ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు అంటూ అబద్ధాలు మాట్లాడుతున్నాడన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధ్యక్షుడు లేక రెండు సంవత్సరాలు కొట్టుకుంటున్న కాంగ్రెస్ నాయకులు ప్రజలు ఎప్పుడూ మార్చుకుంటారన్నారు. ుయాదాద్రి దేవాలయం నిర్వహణకు భూములు కోల్పోయిన బాధితులకు అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటున్నారు. అదేవిధంగా కొండాపూర్ నుండి యాదగిరిగుట్ట వరకు రోడ్డు వెడల్పు భూములు కోల్పోతున్న బాధితులకు ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి దష్టికి తీసుకువెళ్లి అన్ని విధాలుగా వారిని న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుఖ్య సుశీల, జెడ్పీ వైస్ చైర్మెన్ దానవత్ బిక్కు నాయక్ ,పాక్స్ చైర్మెన్ నరసింహారెడ్డి, రహెమతు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.