Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
ఆపదలో ఉన్న ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీఅలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన రోగుల బంధువులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రోగులకు నాణ్యమైన ఆహారం అందిస్తూ ఐసోలేషన్ కేంద్రం ద్వారా వైద్యం అందించడం అభినందనీయమని అన్నారు. భారత రాజ్యాంగం నిర్దేశించిన విధంగా ప్రతి పౌరునికి వైద్యం వసతి ఆహారం కనీస సౌకర్యాలు కల్పించాలని ఉన్నప్పటికీ ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూనే తమ తమ పనులు చేసుకోవాలని కోరారు. అన్నదానం కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ హాశం, పుచ్చకాయల నర్సిరెడ్డి ,పాలడుగు ప్రభావతి, దండెంపల్లి సత్తయ్య ,భూతం అరుణకుమారి, కొండా వెంకన్న, ఊట్కూరు మధుసూదన్‌రెడ్డి, బొల్లు రవీందర్‌కుమార్ రేణుక తదితరులు పాల్గొన్నారు.