Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి
నవతెలంగాణ - త్రిపురారం
రైతులను సంఘటిత పర్చి వారి బాగోగులు చర్చించడానికే ప్రభుత్వం రైతు వేదికలు నిర్మించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పెద్దదేవులపల్లి గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదికను ఎమ్మెల్యే నోముల భగత్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల బాగోగులతో పాటు నూతన వ్యవసాయ పద్ధతులు, భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకునేందుకు ఈ వేదికలు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. వరిలో అధిక దిగుబడి సాధించి నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు రామచంద్రనాయక్, మండల పరిషత్ అధ్యక్షురాలు అనుముల పాండమ్మ, జెడ్పీటీసీ భారతినాయక్, సర్పంచ్ అనుముల శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ జైరామ్నాయక్, చంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి, తహసీల్దార్ కేసీ.ప్రమీల, ఏవో పార్వతిచౌహాన్ తదితరులు పాల్గొన్నారు.