Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పద్మజారాణి
నవతెలంగాణ - సూర్యాపేట కలెక్టరేట్
రైతులకు పంట రుణాలు సకాలంలో అందించాలని అదనపు కలెక్టర్ పద్మజ రాణి బ్యాంకర్లను కోరారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమావేశంలో ఎల్డీఎం జగదీష్ చంద్రబోస్‌తో కలిసి ఆమె మాట్లాడారు. 2020-21 వార్షిక సంవత్సరంలో లక్ష్యం రూ.3448.18 కోట్లు ఉండగా రూ.3643.93 కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. జిల్లాలో అన్ని బ్యాంకుల నుంచీ రుణాల మంజూరు 106 శాతం పూర్తి చేశామని తెలిపారు. జిల్లాలో మత్స్య కారులకు చేపల పెంపకం కోసం బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయాలని కోరారు. మహిళా సంఘాలకు రుణాల మంజూరులో పారదర్శకత ఉండాలన్నారు. అనంతరం 2021-22 వార్షిక ప్రణాళిక పుస్తకాన్ని బ్యాంకు అధికారుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సమావేశంలో నాబార్డ్ డీడీఎం సత్యనారాయణ, ఎస్బీఐ ఏజీఎం కృష్ణమోహన్, యూబీఐ చీఫ్ మేనేజర్ మోహన్‌ప్రసాద్, బీఓబీ చీఫ్ మేనేజర్ బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు