Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హుజూర్నగర్రూరల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, ఆశా, అంగన్వాడీ, వీఆర్ఏలకు పీఆర్సీ ప్రకటించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగులపై చిన్నచూపు చూపిందని నాయకులు పులిచింతల నరేందర్రెడ్డి, యూనియన్ నాయకులు బాబురావు, కీర్తి వెంకటేశ్వర్లు, సైదులు, విజరు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడారు. రైతుల కోసం రాత్రింబవళ్లూ పని చేస్తున్న వారి గురించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమన్నారు. జీవో 151 ద్వారా ప్రతి ఐదేండ్లకోసారి వేతన సవరణ చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకూ చేయలేదన్నారు. ఈ విషయంపై అనేకమార్లు మంత్రులు, ఎంపీలకు వినతిపత్రాలు అందజేసినా స్పందించలేదన్నారు.