Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
నవతెలంగాణ - కోదాడరూరల్
వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని కాపుగల్లు, గుడిబండ, చిమిర్యాల, అల్వలపురం గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలు, ఇరిగేషన్ షెడ్లు, పల్లె పకృతి వనాలను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, కలెక్టర్ వినరు కృష్ణారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు. రైతులను సంఘటితం చేసేందుకే ఈ వేదికలు ఎంతో ఉపయోగ పడతాయన్నారు. ఒక్కో రైతు వేదిక రూ.22 లక్షలతో నిర్మించినట్టు చెప్పారు. అనంతరం ఆయా గ్రామాల్లోని లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి, జెడ్పీటీసీ కృష్ణకుమారిశేషు, మార్కెట్ కమిటీ చైర్మెన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, ఆర్డీవో కిశోర్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి రామారావు నాయక్, పంచాయతీరాజ్ డీఈ సతీష్‌బాబు, తహసీల్దార్ శ్రీనివాస్‌శర్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు భాషబోయిన భాస్కర్‌రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అనంత సైదయ్య, ఎంపీడీవో విజయశ్రీ, ఏడీ వాసు, ఏవో రజిని, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మెన్లు ఆవుల రామారావు, శ్రీనివాస్‌రావు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.