Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామన్నపేట : దళిత మహిళా మరియమ్మను లాకప్ డెత్ కు గురైన సంఘటనలో ఏదో కుట్ర దాగి ఉందని దానిని బయట పెట్టాలని టీపీసీసీ ఎస్సీసెల్ కన్వీనర్ మేడి రవి డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఆయనవిలేకరులతో మాట్లాడుతూ అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో దళిత మహిళ లాకప్ డెత్ కు సంబంధించిన కేసులో ఎస్ఐ మహేష్, కానిస్టేబుల్ సలీం, జానయ్య లను సస్పెండ్ సస్పెండ్ చేశారన్నారు. మొత్తం ఈ కేసుకు సంబంధించి ఐదుగురు కానిస్టేబుల్ లు పాల్గొనగా కేవలం ఇద్దరిని మాత్రమే సస్పెండ్ చేయడం వెనుక ఏదో కుట్ర జరిగిందని అర్థమవుతుందని తెలిపారు. అసలు నేరస్తుల కు కఠినమైన శిక్ష పడేవరకుకాంగ్రెస్ పార్టీ పోరాడుతోందాని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భీమనపల్లి శివ, బ్రహ్మ వసుకుల నరేష్, బందెల ప్రశాంత్, మేడి రాజు, వినరు, పరమేష్, అనిల్, మల్లేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.