Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమలగిరి సాగర్
మండలంలోని ఎల్లాపురంతండా, నెల్లికల్, తునికినూతల గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో బుధవారం బాల్యవివాహాల నిర్మూలనకు డప్పు చాటింపు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. అమ్మాయి వయస్సు 18, అబ్బాయి వయస్సు 21 ఏండ్లు ఉంటేనే పెండ్లి చేయాలని కోరారు. మైనర్లకు వివాహాలు చేస్తే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యల్లాపురం గ్రామ సర్పంచ్ కె.బిచ్యనాయక్, కార్యదర్శి రామకృష్ణారెడ్డి, అంగన్వాడీ టీచర్ నీలావతి నాగమణి, ఆయా క్రాంతి, సరోజా, నెల్లికల్ సర్పంచ్ పమ్మి జనార్ధన్‌రెడ్డి, అంగన్వాడీ టీచర్ శ్రీదేవి, తునికినూతల సర్పంచ్ కొర్రపారు, ఎంపీటీసీ స్వాతి, అంగన్వాడీ టీచర్ దేవి, వనిత, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.