Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్దవూర:మండలంలోని కుంకుండుచెట్టు తండా పంచాయతీ పరిధిలోని తూర్పుపూల గూడెం అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బుధవారం టీచర్ పాతనబోయిన యాదమ్మ గుడ్లు, నూనె ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రానికి వచ్చే వారు తప్పకుండా మాస్కులు ధరించాలన్నారు. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాలతో పాటు వక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలని కోరారు.