Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
నల్గొండ నియోజకవర్గ పరిధిలోని 18 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదలైన చెక్కులు రూ.8,65,000 టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి బుధవారం తన నివాసంలో అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యానికి పెద్ద పీటవేస్తున్నారన్నారు. జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటు వల్ల ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. జిల్లాకు పశువైద్య కళాశాల కేటాయించడం ద్వారా జిల్లా రైతుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పోలే వెంకటాద్రి, కర్నాటి మల్లేష్, కంచర్ల శ్రవణ్ గౌడ్, కొండాపురం అరుణ్,యదయ్యా, హైదర్ పాల్గొన్నారు.