Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని,సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జీవో నెంబర్ 60నువెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల నాన్ టీచింగ్,వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా ఇన్చార్జి ఇందూరుసాగర్ మాట్లాడారు.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జీఓ నెం: 60ను ను వెంటనే అమలు చేసి కనీసవేతనంరూ.19 వేలు చెల్లించాలని డిమాండ్‌చేశారు.నాన్ టీచింగ్ సిబ్బందికి ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు.ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సెలవులు మంజూరు చేసి కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, కేజీబీవీ సిబ్బందిని శాశ్వతప్రాతిపదికన రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాకు సంఘీభావం తెలిపిన తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు గోపాల్‌రెడ్డి, యూనియన్ నాయకురాలు సైదమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 4 వేలకు పైగా టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు.కేవలం ప్రభుత్వం చెల్లించే రూ.7500తో కుటుంబపోషణ, పిల్లల చదువులు, ఆరోగ్యం, తదితర సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నామన్నారు.నెలలో ఒక రోజు కూడా సెలవు లేకుండా ఏఎన్ఎంలు, అటెండర్ ,క్రాఫ్ట్ అకౌంటెంట్లు, వర్కర్స్, స్కావెంజర్స్, వాచ్ మెన్ కు కనీసం సెలవులు ఇవ్వడంలేదని మహిళా కార్మికులకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని వాపోయారు.ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఐఎఫ్టీయూ నాయకులు సీిహెచ్.సునీత, సైదమ్మ, పి.దేవకమ్మ జి.జానకమ్మ సుల్తానా, జి.నర్మద, విజయలక్ష్మీ, అంజమ్మ, వెంకటమ్మ, రంగమ్మ, పద్మ, ఉమా, సునీత, చిన్నమ్మ, ఇందిరమ్మ, రాజమ్మ,అలివేలు పాల్గొన్నారు.