Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకు సభ్యులంతా మా కుటుంబ సభ్యులే..
- 'నవతెలంగాణ'తో డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయప్రతినిధి
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ ) అంచెలంచెలుగా ఎదుగుతూ రైతుల సంక్షేమమే బ్యాంకు లక్ష్యంగా పనిచేస్తూ వస్తుంది.ఎంతో మంది రైతులకు పంట రుణాలు, వ్యవసాయేతరరుణాలు, కిసాన్మార్టిగేజ్ రుణాలు, బంగారుఅభరణాలకు రుణాలతో పాటుగా రైతుల పిల్లలు విదేశాలలో విద్యాభ్యాసం కోసం డీసీసీబీ నుంచి ఆర్థిక సహకారం అందిస్తూ వారి ఆర్థిక పురోగతి పాటు పడుతుంది. నోట్ల రద్దు వంటి విపత్కర పరిస్థితులలో కూడా డిపాజిట్లు సేకరించి ఖాతాదారులకు అభయం అందించింది. అంతేగా కుండా కోవిడ్-19 రూపంలో ప్రకృతి విపత్తులను సైతం ఎదుర్కొని సామాన్యులకు రుణాలందించి ఆర్థికస్వాలంభనకు ఉపయోగపడడమే గాకుండా రైతులకు వెన్నెముక మాదిరిగా తమ బ్యాంకు నిలబడుతుందని డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి 'నవతెలంగాణ'తో బ్యాంకు అభివృద్ధి విషయాలను పంచుకున్నారు.
బ్యాంకు డిపాజిట్ల సేకరణ....
డిపాజిట్ సేకరణమహోత్సవంలో భాగంగా మూడు రకాల పథకాలతో పెద్దఎత్తున డిపాజిట్లను సేకరించాం. సహకారశతాబ్ది, సహకార ధనవర్ష, సహకార అభ్యుదయ లాంటి పథకాలతో భారీస్థాయిలో డిపాజిట్లు సేకరిం చార.ఐదేండ్ల కింద రూ.308 కోట్లు డిపాజిట్లో ఉండగా ఇప్పుడు రూ.480 కోట్ల వరకు చేరుకున్నాం.
కొత్తసభ్యులకు రుణసౌకర్యం....
కరోనాలాంటి విపత్కర పరిస్థితులలో స్వల్పకాలిక రుణాలను అందజేశాం. వరి దిగుబడిలో రాష్ట్రంలోనే మన జిల్లాకు ప్రథమ స్థానం లభించింది. కోవిడ్ నిధుల రూపంలో నూతనసంఘం సభ్యులు 19253 మందికి రూ.111కోట్ల రుణసౌకర్యం అందించాం.తమ బ్యాంకు సకాలంలో రుణాలు అందించడం వల్లే పంటల సాగుకు తోడ్పడింది.
ఈ ఏడాది రూ.550కోట్ల రుణాలు....
ఈ ఏడాది స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు కలిపి దాదాపు రూ.550 కోట్ల రుణాలను రైతులకు అంద జేస్తున్నాం.ఇందులో స్వల్పకాలిక రుణాలు గతేడాది రూ.150 కోట్లు పంపిణీ చేయగా ఈసారి రూ.450కోట్లు లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు రూ.10 కోట్లు పంపిణీ చేశారు. దీర్ఘకాలిక రుణాలలో గతేడాది రూ.65కోట్లు అందజేయగా ఈసారి రూ.100 కోట్లు టార్గెట్ కాగా నేటికి రూ.9 కోట్లు రైతులకు చెల్లించారు. మూడేండ్లకాలంలో నాబార్డు నుంచి వచ్చిన రాయితీ సొమ్ము రూ.24 కోట్లు 1060 మంది సభ్యులకు వారి బ్యాంకు రుణఖాతాలో చేశార.ముఖ్యంగా గతేడాది వచ్చిన రాయితీ రూ.15 కోట్ల సొమ్మును రైతులఖాతాలో జమచేశాం.ఇంత అధిక మొత్తంలో రాష్ట్రంలోనే ఎక్కడ చేయలేదు.
వడ్డీ వ్యాపారుల నుంచి కాపాడాం...
పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో రైతులు, పేదలకు ఏదైనా ఆర్థిక అవసరం వస్తే వెంటనే వారంతా వెళ్లేదీ కేవలం వడ్డీ వ్యాపారుల వద్దకే.ఆ సందర్భంలో అధికంగా వడ్డీ తీసుకుని ఆర్థికంగా నష్టం చేస్తారు.దానిని దృష్టిలో పెట్టుకుని బంగారు అభరణాలపై తమ బ్యాంకు నుంచి రుణసహాయం అందించాం.అందులో భాగంగానే గతేడాది 26388 మంది సభ్యులకు రూ.240 కోట్ల రుణాలందించాం.ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.190 కోట్లు లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటికే దాదాపు 60కోట్లు అందజేశాం.
ఉన్నత విద్యాభ్యాసం కోసం కూడా...
వాణిజ్యబ్యాంకులకు దీటుగా రైతులపిల్లలు విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం కోసం అవసరమైన ఆర్థికంగా రుణసహాయం కూడా చేస్తున్నాం.భూమిని తనఖ పెట్టుకుని విద్యారుణాలందిస్తున్నాం. సుమా రుగా ఇప్పటివరకు 80మంది వరకు అమెరికా, కెనడా, లండన్, ఫ్రాన్స్ లాంటి దేశాలలో ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలలో విధ్యాభ్యాసం కోసం రుణసహాయం చేశాం.ఇలాంటి రుణాలు ఐదేండ్ల కాలం నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.900 దాటింది.
చేనేత అభివృద్ధి కోసం రుణాలు...
చేనేత అభివృద్ధి కింద కొయ్యలగూడెం, పోచంపల్లి, భువనగిరి, చౌటుప్పల్, బోగారం, కొండగట్ల, నారా యణపురం, సిరిపురం సంఘాలకు క్యాష్ క్రెడిట్ రూ.4.52 కోట్లు ఇస్తున్నాం.అంతేగాకుండా సమభావన సంఘాలకు డీసీసీబీ నుంచి రూ.100కోట్లు రుణసహాయం ఇవ్వాలని నిర్ణయించాం. ఇప్పటివరకు బ్యాంకు నుంచి అందించిన రుణాల రీకవరి కూడా అద్భుతంగా ఉంది.56శాతం వరకు తగ్గింది.
ఉమ్మడి జిల్లాలో 12లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ...
ఉమ్మడినల్లగొండ జిల్లాలో వివిధ మండలాలలో స్థానిక ప్రాథమిక సహ కారసంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.వాటి ద్వారా ఈ రబీ సీజన్లో దాదాపు 12లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు.వీటిల్లో నల్లగొండలో 5.30లక్షల మెట్రిక్ టన్నులు, యాదాద్రి 2.49లక్షల మెట్రిక్ టన్నులు, సూర్యా పేట 4.10లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించారు. కొన్నేండ్లుగా ఈ కొనుగోళ్ల వల్ల అనేక సంఘాలు ఆర్థికంగా బలోపేతమైన దాఖలాలు కూడా ఉన్నాయి.