Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
ఈ నెల 23న ఆర్థిక ఇబ్బందులకు తాళలేక 40బీపీట్యాబ్లెట్స్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన చేనేత కార్మికురాలు గురువారం మృతిచెందిన సంఘటన మండలంలోని సిరిపురం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సిరిపురం గ్రామంలోని చేనేత కుటుంబానికి చెందిన కోడి రాజ్యలక్ష్మి (50) చేనేత వత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మూలంగా చేనేత వత్తి సాగక కుటుంబం గడవక ఇబ్బందులకు లోనయ్యారు. భర్త శ్రీనివాస్ చేనేత వత్తి చేస్తూ సుమారు రూ.3లక్షల వరకు గ్రామంలో అప్పులు చేశారు. లాక్ డౌన్ మూలంగా పనులు లేకపోవడంతో అప్పులు తీరే మార్గం కనిపించకపోగా కుటుంబం గడవని పరిస్థితి నెలకొంది. దంపతులిద్దరూ ఈ విషయమై తరచూ చర్చించుకుంటూ ఉండేవారు. సమీప భవిష్యత్తులో అప్పులు తీరే మార్గం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన రాజ్యలక్ష్మి బుధవారం భర్త శ్రీనివాస్ వాడే సుమారు 40 బీపీ టాబ్లెట్లను వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భర్త శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్ఐ వినోద్ తెలిపారు.