Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాభసాటి వ్యవసాయానికి సీఎం కేసీఆర్ నిర్ణయం
- అధిక ఆదాయం గడించిన రోజునే రైతు రాణించినట్టు
అ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
- పెన్‌పహాడ్ మండలం మొల్కా పురంలో ఏరువాక పౌర్ణమి
నవతెలంగాణ - పెన్‌పహాడ్
ఎకరా ఆదాయం రూ.లక్ష దాటించడమే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన ప్రణాళికలు అమలు రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టు తెలిపారు. లాభసాటి వ్యవసాయం వైపు రైతులను మళ్లించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అని మంత్రి అన్నారు. గురువారం పెన్‌పహాడ్ మండలం గాజుల మొల్కాపురం గ్రామంలో ఏరువాక పౌర్ణమిని మంత్రి ప్రారంభించారు. కేవీకే రైతుమిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు వందకుపైగా నాగళ్లతో మొదలైన ఏరువాక కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి స్వయంగా నాగలి దున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014కు ముందు వరుస కరువులు, ఆకలి చావులు, ఆత్మహత్యలతో ఈ ప్రాంతం దుర్భిక్షంగా మారి ఉందన్నారు. అలాంటి సందర్భంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చారన్నారు. మూడేండ్ల వ్యవధిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారన్నారు.యావత్ భారతదేశంలో వరి దిగుబడిలో మొదటిస్థానం లో ఉన్న పంజాబ్‌ను మించి తెలంగాణా రికార్డ్ సృష్టించిందని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రమే కారణమన్నారు. ఋణమాఫీని అమలు చేస్తూనే వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడిని రైతుబందు పథకం కింద అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, ఎంపీపీ నెమ్మాది బిక్షం, మార్కెట్ కమిటీ చైర్మెన్ ఉప్పల లలితా ఆనంద్, జెడ్పీ వైస్ చైర్మెన్ వెంకట్‌నారాయణగౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వైవి, కేవీకే రైతుమిత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు పగడాల ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.