Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం), సీపీిఐ ఆధ్వర్యంలో భువనగిరిలో ధర్నా
నవతెలంగాణ - భువనగిరి.
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ,డీజిల్, గ్యాస్ , నిత్యావసర ధరలను తగ్గించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ డిమాండ్ చేశారు. ధరలను తగ్గించాలని కోరుతూ సీపీఐ(ఎం) , సీపీఐ ఆధ్వర్యంలో గురువారం పట్టణకేంద్రంలోని ఇండియన్ మిషన్ స్కూల్‌కు ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ ధరల పెరుగుదలతో సామాన్యులు ,మధ్యతరగతి ప్రజలపై విపరీతంగా భారాలు పడుతున్నాయన్నారు. పెరిగిన పెట్రోల్ ,డీజిల్ ధరలతో ట్రాన్స్‌ఫోర్ట్, ఆటో, రవాణా రంగం చతికిల పడిపోయిందన్నారు. దీనిపై ఆధారపడిన ట్రాన్స్ఫోర్ట్ట్్ ,ఆటో కూరగాయలు రవాణాకు సంబంధించిన అన్నింటి ధరలు పెరిగి కొనలేని, తినలేని పరిస్థితుల్లో పోషకాహారలోపంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక నెలలో రూ.28 సార్లు పెట్రోలు ,డీజిల్ ధరలు పెరగడం వల్ల పెట్రోల్ ,డీజిల్ ధరలు రూ.102 పెరిగిందన్నారు. నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం రూ. 33 పన్ను రాష్ట్ర ప్రభుత్వ పన్ను రూ.32 విధించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గించినా దేశంలో ధరలు తగ్గించకపోవడం మోడీ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు . పెట్రోల్ ,డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చినట్టయితే ఒక లీటర్ పెట్రోలు రూ.65 రూపాయలకు అందించవచ్చన్నారు. నరేంద్ర మోడీ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు రూ.410 ఉన్న గ్యాస్ ధర ఏడేండ్ల కాలంలో రూ. 900 పెరిగిందన్నారు. పెరిగిన ధరలతో ప్రజల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయని పెంచిన ,పెట్రోల్ ,డీజిల్ ,గ్యాస్ నిత్యావసర సరకులను అదుపుచేయలేని నరేంద్ర మోడీ వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ ,సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నర్సింలు, మాటూరి బాల్‌రాజ్ గౌడ్, కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు దాసరి పాండు ,మాయ కష్ణ ,దయ్యాల నరసింహ ,అనగంటి వెంకటేష్ ,సీపీఐ మండల కార్యదర్శిముదిగొండ రాములు, ఆ పార్టీల నాయకులు అన్నంపట్లకష్ణ , వడ్డెబోయిన వెంకటేష్ , కొండఅశోక్ , ముదిగొండ రాఘవులు,కుకుంట్ల కష్ణ, దాసరి లక్ష్మయ్య, సోమ శ్రీశైలం ,పాలడుగు రవి పాల్గొన్నారు.