Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతి చెందిన బ్యాచ్మెట్ కుటుంబానికి రూ.లక్ష అందజేత
- 990 బ్యాచ్మెట్స్ను అభినందించిన డీఐజీ రంగనాధ్
- అండగా నిలుస్తామన్న అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
1990 బ్యాచ్ పోలీస్ అధికారులు మానవత్వంతో తోటి బ్యాచ్ మేట్ కుటుంబానికి అండగా నిలిచి ధైర్యాన్ని ఇవ్వడం ఎంతో అభినందనీయమని డీఐజీ ఏవీ.రంగనాథ్ అన్నారు.గురువారం క్యాంపు కార్యాలయంలో 1990 బ్యాచ్‌కు చెందిన మునుగోడు పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మతి చెందిన పోలా ప్రభాకర్ కుటుంబానికి 1990 బ్యాచ్‌మేట్స్ అందరూ కలిసి సేకరించిన రూ.లక్షను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ఉద్యోగం నిరంతర సవాళ్ళతో కూడుకున్నదన్నారు.ఎన్నో రకాల ఒత్తిళ్ల మధ్య విధి నిర్వహణ చేస్తూ ప్రజల రక్షణ కోసం పని చేస్తున్నారన్నారు.అనారోగ్య సమస్యలతో మతి చెందిన ఏఎస్సై ప్రభాకర్ కుటుంబానికి తోటి బ్యాచ్‌మేట్స్ అందరూ మానవత్వంతో ఆయన కుటుంబానికి అండగా నిలవడం ఎంతో గర్వకారణమని చెప్పారు.తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై. గోపిరెడ్డి మాట్లాడుతూ పోలీసుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులను కేటాయిస్తూ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందన్నారు.పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో పోలీసుల సంక్షేమం కోసం నిరంతరం కషి చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నర్మద, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు, 1990 బ్యాచ్ కు చెందిన బి.జయరాజ్, యాదగిరి, సోమయ్య, జలీల్, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.