Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయాన్ని కాపాడండి...
- ప్రజాస్వామ్యాన్ని రక్షించండి
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, వ్యవసాయాన్ని కాపాడండి... ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.అనంతరం డీఏఓ మౌలానాకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విధానాలు అమలు చేస్తుందన్నారు.దీని ఫలితంగా రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.46 ఏండ్ల కింద ఎమర్జెన్సీ పాలనను గుర్తుకు తెచ్చే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు.వెంటనే రైతు వ్యతిరేక చట్టాలు రద్దుచేసి వ్యవసాయరంగాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.రైతులకు కనీస మద్దతు ధర అందేలా గ్యారెంటీ చట్టం తీసుకురావాలని కోరారు.ఇప్పటికే 750 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదు కోవాలన్నారు.కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, దాని ఫలితంగా నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వాపోయారు.పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యప్రజలపై భారం వేశారని వాపోయారు.వ్యతిరేక చట్టాలు వెనక్కు తీసుకోకపోతే ప్రజాఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.ప్రజలు చైతన్యవంతులై వ్యతిరేక విధానాలపై బలమైన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లేష్, రైతుసంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు రవినాయక్, జగదీష్‌చంద్ర, డాక్టర్ మల్లుగౌతంరెడ్డి, మంగారెడ్డి, బావండ్ల పాండు, చౌగాని సీతారాములు, గోవింద్‌రెడ్డి, గొర్ల ఇంద్రారెడ్డి, సత్యనారాయణ, దేశీరామ్నాయక్, తిరుపతి రామ్మూర్తి, యాదగిరి, బీఎం.నాయుడు, కోడిరెక్క మల్లయ్య, చౌగాని వెంకన్న, రామారావు, రాములు పాల్గొన్నారు.
రైతు ఉద్యమమే మోడీ పాలనకు చరమగీతం పాడుతుంది
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన
నల్లగొండ : ఏడు నెలలుగా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్న రైతాంగానికి మద్దతుగా, కార్మిక వ్యతిరేక కోడ్లను, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని అఖిల భారత రైతు సంఘాల కోఆర్డినేషన్ కమిటీ వామపక్ష ప్రజా సంఘాల పిలుపుమేరకు శనివారం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ఎదుట నిరసన ధర్నా చేశారు. సందర్భంగా వారు 'సేవ్ డెమోక్రసీ, సేవ్ అగ్రికల్చర్, సేవ్ పబ్లిక్ సెక్టార్, మోడీ విధానాలను ప్రతిఘటించండి' అంటూ నిందించారు. అనంతరం రైతు, వ్యవసాయ కార్మిక ,కార్మిక ,ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు నారి అయిలయ్య, బండ శ్రీశైలం, గుర్జరామచంద్రయ్య వస్కుల మట్టయ్య, కె.పర్వతాలు, చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడారు.ఏడు నెలలుగా ఎముకలు కొరికే చలిలో మండే ఎండల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలను లాఠీలు, తూటాలను, అరెస్టులు జైలును సైతం లెక్కచేయకుండా ఎంతో ధైర్యంతో సమరశీలంగా పోరాడుతున్నా రైతాంగానికి యావత్ సమాజ మంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు.మోడీ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయకపోతే రైతాంగ ఉద్యమమే మోడీ పాలనకు చరమగీతం పాడుతుందని హెచ్చరించారు.నాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటిస్తే నేడు ఎమర్జెన్సీ లేకుండానే మోడీ నియంతత్వ పాలన చేస్తున్నారని, ప్రశ్నించే పోరాడే వారిపైన దేశద్రోహం కేసులు పెడుతూ ప్రజాస్వామ్య,రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నారన్నారు.ఈ రైతుఉద్యమం భారతదేశ చరిత్రలోనే మరో స్వతంత్ర ఉద్యమంగా శాంతియుతంగా నడుస్తుందని ఇప్పటికే 500 మంది రైతులు ఉద్యమంలో ఊపిరిలూదిన మొక్కవోని ధైర్యంతో పోరాడుతున్న రైతాంగానికి ప్రజలంతా అండగా ఉండాలని కోరారు.కరోనా వచ్చి ప్రజల ప్రాణాలు పోతుంటే, ఉపాధి పోయి ఇబ్బందులు పడుతుంటే అవి పట్టించుకోకుండా దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెట్టే పనిలో మోడీ ఉన్నారని ఎద్దేవా చేశారు.అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ రైతు, కార్మిక,ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్లకు భజన చేస్తున్నారని విమర్శించారు.ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే ఉద్యమం ఉధతం అవుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు దండెంపల్లి సరోజ, పబ్బు వీరస్వామి, మన్నెం భిక్షం, రామకష్ణ, వి.ముత్తిలింగం,పోలే సత్యనారాయణ, మారయ్య, మధుసూదన్‌రెడ్డి, కనకయ్య,లక్ష్మయ్య, గాదెపాక రమేశ్,వస్కుల గోపి, ఇమ్మానియేల్, వి.కిరణ్ పాల్గొన్నారు.