Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
రాష్ట్రంలో దళిత,గిరిజనులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని, కంటితుడుపు చర్యలు కాకుండా సమగ్ర విచారణ జరపాలని, లాకప్‌డెత్ గురైన మరియమ్మ మతికి కారణమైన పోలీసులను ఉద్యోగం నుంచి తొలగించాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. శనివారం కేవీపీఎస్, ఐక్య దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మరియమ్మ మతికి కారణమైన పోలీసులపైనా, బాధ్యులపైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం, హత్యానేరాన్ని నమోదు చేయాలని డిమాండ్ చేశారు.సీఎం కేసీఆర్ కంటితుడుపుచర్యలు మానుకుని రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రత్యేక అసెంబ్లీని ఏర్పాటు చేసి చర్చించాలని కోరారు.ఐక్య దళిత గిరిజన సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.రాష్ట్రంలో దళితుల అభివద్ధి కుంటు పడిందన్నారు.ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయన్నారు.దళితులకు ఇచ్చిన హామీలైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు,మూడెకరాల భూమి మర్చిపోయారని విమర్శించారు.రాష్ట్రంలో ఏండ్లుగా జరుగుతున్న ఘటనలపై, హత్యలు గురైన వారికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు బకరం శ్రీనివాస్,ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు భిక్షమయ్య, తెలంగాణ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మేడి నర్సింహ, కేవీపీఎస్ పట్టణ అధ్యక్షులు కష్ణయ్య పట్టణ కార్యదర్శి గాదె నర్సింహ, నాయకులు పోలే సత్యనారాయణ, భూతం కృష్ణ, మంజుల,రామకష్ణ, నర్సింహ, సైదులు పాల్గొన్నారు.