Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మఠంపల్లి
మండలంలోని బక్కమంతులగూడెంలో పల్లెప్రకృతి పనులను శనివారం డ్వామా ఏపీడీ పి.పెంటయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు.కలెక్టర్ ఆదేశాల మేరకు కొందరుకార్యదర్శులు రోజువారి విధులకు సక్రమంగా హాజరు కాకుండా పల్లెప్రకృతి పనులను చేస్తున్న వారిని గుర్తించి తగిన చర్యలకు సిఫార్సు చేయడానికి ఆకస్మిక తనిఖీకి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ 7వ విడత హరితహారం ముందస్తు ఏర్పాట్లను పరిశీలించి కార్యదర్శి పనితీరుపై తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు.అనంతరం నెల రోజులుగా కలెక్టర్ దిశానిర్దేశం చేస్తూ ఉన్నప్పటికి ఇప్పటివరకు గ్రామ హరిత ప్రణాళిక తయారు చేయని కార్యదర్శి,ఒకటవ విడత నుండి 5వ విడత హరితహారంలో నాటిన మొక్కల వివరాలను గ్రామపంచాయతీలో లేకపోవడం, నర్సరీలో కలుపు నిండి ఇంతవరకు పొడవు, పొట్టి మొక్కలను వేరు చేయించకపోవడం, నర్సరీలో రిజిస్ట్రర్లు లేకపోవడం. మొక్కలు లేని ఖాళీ సంచులను ఉంచడం, ప్రాథమిక నారుమడులు తీయకపోవడాన్ని గుర్తించారు.పల్లె ప్రకృతి పనులపై కనీసం అవగాహన లేకుండా గ్రామాభివృద్ధికి కుంటు పడేలా పనిచేస్తే వేటు తప్పదని హెచ్చరి ంచారు.మూడు రోజుల్లో తిరిగి మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని, పనితీరు మార్చుకొని తెలియని విషయాలు తెలుసుకొని ఇచ్చిన ఆదేశాలను సకాలంలో పూర్తి చేయాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి ఎంపీడీఓ జానకిరాములు, వెంకటరెడ్డి, ఎంపీటీసీ నాగిరెడ్డి, వెంకటేష్, సిబ్బంది, పాల్గొన్నారు.