Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలను మాను కోవాలని సీపీఐ (యం.యల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్ హెచ్చరించారు.శనివారం జిల్లా కేంద్రంలోని సుభాష్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సంఘాలు,కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో హైదరాబాదులో చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని శాంతి యుతంగా నిర్వహిస్తున్న రైతు సంఘాలు, కార్మిక సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి గాంధీనగర్, చిక్కడపల్లి, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లలో అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామిక చర్యఅని పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిలో ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు జి.ఝాన్సీ, ఐఎఫ్టీయూ రాష్ట్ర,కార్యదర్శి,కె సూర్యం,సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె.రామ, జెవీ.చలపతిరావు, ఎస్ఎల్.పద్మ, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.మహేష్, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి కె.ఎస్ ప్రదీప్,అరుణక్క, హన్మేష్తో పాటు సినీ నటుడు నారాయణమూర్తి,ఇతర పార్టీల, ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేసి నిర్బంధించారని తెలిపారు.వెంటనే రైతు,కార్మిక,వ్యతిరేకం చట్టాలను రద్దు చేయాలని, నూతన విద్యావిధానం ను ఉపసంహరణ చేసుకోవాలని,పెంచిన, గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, ఐఎఫ్టీయూ నాయకులు బొమ్మిడి నగేష్,కత్తుల చంద్రశేఖర్, కుంచం వెంకన్న,దాసరి నర్సింహ, చారి, జానపాటి శంకర్, కల్లూరి అయోధ్య, వెంకటరమణ, రాజు,అత్తి లింగయ్య, సుధాకర్, పరమేష్, ప్రవీణ్ పాల్గొన్నారు.