Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హాలియా
దళిత మహిళ మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్, సీఐటీయూ, ఎమ్మార్పీఎస్,ఐద్వా,మాలమహానాడు, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పట్టణంలోని బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను, మాలమహానాడు జిల్లా నాయకులు ముదిగొండ వెంకటేశ్వర్లు మాట్లాడారు.మరియమ్మ లాకప్‌డెత్‌కు, కుమారుడు ఉదరుకిరణ్ను చిత్రహింసలకు గురి చేసిన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను శాశ్వతంగా విధుల నుండి తొలగించాలని కోరారు.బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా కరీంగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ మతో న్మాదులు అంబేద్కర్ విగ్రహానికి పార్టీ జెండాతో కట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నామ లింగయ్య, దొంతాలనాగార్జున, గార్లపాటి ప్రసాద్‌మాదిగ, గడుసు సైదీష్మాదిగ, అవుతా సైదులు, నకిరేకంటి సైదులు, ఆకారపు నరేష్, దోరేపల్లి మల్లయ్య, కారంపూడి ధనమ్మ, జటావత్ రవినాయక్, పొదిల వెంకన్న, పోలే ఇసాక్, పోలే ప్రవీణ్ పాల్గొన్నారు.