Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కట్టంగూర్
మండలంలోని ఇస్మాన్పల్లి గ్రామ పరిధిలోని జాతర బావి, గోదాలకుంటలను అక్రమంగా కొనుగోలు చేసి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పెంజర్ల సైదులు డిమాండ్ చేశారు.శుక్రవారం ఇదే విషయమై నీటిపారుదల శాఖ ఈఈకి ఉపసర్పంచ్ ఆంజనేయులు ఫిర్యాదు చేయగా శనివారం ఐబీ ఏఈ రాజశేఖర్‌రెడ్డి, ఆర్ఐ కుమార్‌రెడ్డి పరిశీలనకు వచ్చారు.ఈ సందర్భంగా వారికి సైదులు పరిస్థితిని వివరించారు నీరు నిల్వ ఉండే ఈ కుంటలను స్థానిక సర్పంచ్ ప్రోత్సాహంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రేగట్టె నర్సింహ కొనుగోలు చేశారని విమర్శించారు.కొనుగోలు చేసిన నర్సింహ,పెంజర్ల కిష్టయ్య కుంటలకు వచ్చే వరద కాలువను తొలగించి సేద్యం చేస్తున్నారని దీంతో చుట్టుపక్కల రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని అధికారులకు విన్నవించుకున్నారు. నిజాం కాలం నుండి కుంటలు ఉన్నాయని అని ఈ కుంటలో నీరు నిల్వ ఉండటం వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు కలుగుతుందని చెప్పారు. గ్రామానికి చెందిన మాజీ ప్రజా ప్రతినిధి, ప్రస్తుత సర్పంచ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కై ఇలా వ్యవహరించడం తగదని రైతులు వాపోయారు. పైఅధికారులు ఇకనైనా స్పందించి అక్రమాలకు పాల్పడ్డ వారిపై తగు చర్యలు తీసుకొని కాలువలు ద్వారా కుంటలలో నీరు చేరే విధంగా చూడాలని అధికారులను కోరారు. వారి వెంట ఉపసర్పంచ్ జాల ఆంజనేయులు, వార్డు సభ్యులు మాదసైదులు, రేఖల అండాలు, మాధవి,పుష్ప రైతులు మేడబోయినభిక్షమయ్య, నర్సింహ, నర్సిరెడ్డి, సైదులు, అర్జున్‌రెడ్డి ఉన్నారు.