Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా దామోదర్‌రెడ్డి నియామకం
- జిల్లా కాంగ్రెస్‌లో కొత్త జోష్
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయప్రతినిధి
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియ మితులయ్యారు. పీసీసీ పదవి కోసం ప్రధానంగా ముగ్గురు నాయకుల మధ్య తీవ్రమైన పోటీ నడిచింది. అందులో జిల్లాకు చెందిన సీనియర్ నేత, భువన గిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరు కూడా ఢిల్లీలో జరిగిన చర్చల్లో ప్రధానంగా చర్చకు వచ్చింది. చివరకు యువతలో మంచి ఫాలో యింగ్ ఉన్న రేవంత్‌రెడ్డిని ఎంపిక చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికి జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. అదే దారిలో ఇప్పుడు కూడా పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంది. రేవంత్‌రెడ్డికి జిల్లాలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. పీసీసీ కోసం పోటీ పడ్డ కోమటిరెడ్డి వెంక ట్రెడ్డికి జాతీయ కమిటీలో సముచిత స్థానం కల్పించనున్నట్టు నాయకత్వం హామీ ఇచ్చినట్టు సమాచారం. ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డి, ఆర్.దామెదర్‌రెడ్డి ఏ రోజూ రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు లేవు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా మని అనేకసార్లు వాళ్లు పేర్కొన్నారు. మిగతా నాయకులతో కూడా ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు పటేల్ రమేష్‌రెడ్డితో రేవంత్‌రెడ్డికి దగ్గర అనుబంధం ఉంది. విద్యార్థి దశలో వారిద్దరూ కలిసి విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత టీడీపీలో ఉన్నపుడు కూడా చనువుగా మెలిగారు. చిన్ననాటి నుంచి ఉన్న స్నేహం ఇప్పటి వరకు కొనసాగు తుంది. ఇపుడు రేవంత్‌రెడ్డికి వచ్చిన పీసీసీ అవకాశంతో రాబోయే రోజుల్లో పటేల్ రమేష్‌రెడ్డికి మంచి అవకాశాలు రావొచ్చని తెలుస్తుంది. సూర్యాపేట జిల్లా రాజకీ యాల్లో ఆయన కీలకపాత్ర పోషించ నున్నారు. అంతే కాకుండా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు మంచి భవిష్యత్ రానుంది. దీంతో పాటు సూర్యా పేటకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా అవకాశం కల్పించారు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ మరింత బలపడే అవకాశం ఉంది.
తనకు పీసీసీ పదవి ప్రకటించిన వెంటనే రేవంత్‌రెడ్డి సీనియర్ నేత, నాగా ర్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డి ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సహకారం అవసరమని కోరారు. జిల్లాలో యువ నాయకత్వం రేవంత్‌రెడ్డి రాకతో మరింత దూకుడుతో పని చేసే అవకాశం ఉంది. రేవంత్‌రెడ్డి ఎన్నిక పట్ల ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా కాంగ్రెస్ నాయకులు బాణా సాం చాలు కాల్చి సంబురాలు చేసుకున్నారు.