Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ - భువనగిరిరూరల్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు సమన్వయ కమిటీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఎస్ జిల్లా నాయకులు మంగ నర్సింహులు, కొల్లూరి రాజయ్య మాట్లాడుతూ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏడు నెలలుగా రైతులు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అంతే కాకుండా రైతు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం అనేక మంది ఉద్యమకారులను జైలుకు పంపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీహరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహా, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పాండు, ప్రజా సంఘాల నాయకులు ఆడివయ్య, రాచకొండ జనార్ధన్, వీరస్వామి, దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, పైలా యాదిరెడ్డి, రమేష్, సహదేవ్, స్వామి, సదానందం, రవిలింగం తదితరులు పాల్గొన్నారు.