Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి
నవతెలంగాణ - భువనగిరిరూరల్
మాదక ద్రవ్యాల వినియోగానికి యువత ఎక్కువగా ఎక్కువగా ఆకర్షిలవడం ఆందోళన కల్గిస్తున్న విషయమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు కృషి చేయాలని జిల్లా సంక్షేమ అధికారి కేవీ కృష్ణవేణి కోరారు. శనివారం పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవన్లో మహిళా శిశు సంక్షేమ, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు స్వచ్ఛంద సేవా సంస్థల సహకారం ఎంతో అవసరమన్నారు. ఎక్సెజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ మాట్లాడుతూ పిల్లలను ఎప్పటికప్పుడూ గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మెన్ బండారు జయశ్రీ, సభ్యులు శివరాజు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మాజీ చైర్మెన్లు నిమ్మయ్య, రాజిరెడ్డి, షార్ట్ సంస్థ సభ్యులు ప్రమీల, సీడీపీవో స్వరాజ్యం, డీసీపీవో సైదులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, యువత పాల్గొన్నారు.