Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పల్లెప్రగతితో గ్రామాల అభివద్ధి
- గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కషి
- రూ.12.60లక్షలతో నిర్మించిన శ్వాశన వాటికను ప్రారంభించిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
నవతెలంగాణ-దేవరకొండ
గ్రామాల అభివద్ధికి ప్రభుత్వం కషి చేస్తుందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.ఆదివారం మండలం కొండభీమనపల్లి గ్రామంలో రూ.12.60 లక్షలతో నిర్మించిన శ్మశానవాటికను ఆయన ప్రారంభించి మాట్లాడారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెప్రగతితో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలకల్పనకు కషి చేస్తానన్నారు.అన్నిగ్రామాల్లో వైకుంఠదామాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. గ్రామాల్లో డంపింగ్‌యార్డుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ శిరందాసు లక్ష్మమ్మకష్ణయ్య, ఎంపీపీ నల్లగాసు జాన్‌యాదవ్, జెడ్పీటీసీ మారుపాకుల అరుణసురేష్‌గౌడ్, రైతు అధ్యక్షులు శిరందాసు కష్ణయ్య, పీఏసీఎస్ చైర్మెన్ పల్లా ప్రవీణ్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ చింతపల్లి సుభాష్, సర్పంచుల ఫోరం మండలఅధ్యక్షుడు నేనావత్ శ్రీను, సర్పంచ్ మునికుంట్ల విద్యావతి వెంకట్‌రెడ్డి, ఉపసర్పంచ్ పాండు, కార్యదర్శి నిరంజన్ పాల్గొన్నారు.
రైతు వేదికలు ఆధునిక దేవాలయాలు :
రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలు రైతాంగానికి ఆధునిక దేవాలయాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.మండలంలోని కొండభీమనపల్లి గ్రామంలో నిర్మించిన రైతువేదిక భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.విత్తనాల పంపిణీ నుండి పండించిన పంట మార్కెటింగ్ వరకూ అనుభూతులు, అనుభవాలు పరస్పరం పంచుకునేందుకు రైతాంగానికి ఒక వేదిక అని తెలిపారు.సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే తెలంగాణ ప్రాంతంలో సాగు, తాగునీరు లభిస్తుందన్నారు. అంతకు ముందు సాగునీరు కాదు కదా...తాగునీరు లేని దుర్భరపరిస్థితులను ఇక్కడి రైతాంగం ఎదుర్కొందని గుర్తుచేశారు.ఉమ్మడి రాష్ట్రంలో ఎంతపంట దిగుబడి అయ్యిందో ప్రస్తుతం ఒక్క తెలంగాణ రాష్ట్రంలో అంతటి పంట దిగుబడి అయి ధాన్యం దిగుబడిలో యావత్ భారతదేశంలోనే మొదటి స్థానానికి చేరుకున్నా మన్నారు.అనంతరం ఆయా గ్రామాలకు సంబంధించిన కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.అదేవిధంగా కొండభీమనపల్లి గ్రామంలో పల్లెప్రకృతివనాన్ని ఆయన ప్రారంభించారు. వచ్చేనెల ఒకటి నుంచి పల్లె, పట్టణ ప్రగతి ప్రారంభ మవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ కష్ణయ్య, ఎంపీపీ నల్లగాసు జాన్ యాదవ్, జెడ్పీటీసీ మారుపాకుల అరుణసురేష్ గౌడ్, రైతు అధ్యక్షులు అధ్యక్షుడు శిరందాసు కష్ణయ్య, పీఏసీఎస్ చైర్మెన్ పల్లా ప్రవీణ్‌రెడ్డి, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నేనావత్ శ్రీను, సర్పంచ్ మునికుంట్ల విద్యావతి వెంకట్ రెడ్డి, ఉపసర్పంచ్ పాండు, కార్యదర్శి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.