Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వీట్లు పంపిణీచేసిన పటేల్‌రమేశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
మల్కాజిగిరి ఎంపీ అనుముల రేవంత్‌రెడ్డికి టీపీసీసీఅధ్యక్షపదవి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శనివారం రాత్రి టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేశ్‌రెడ్డి తన ఇంటి వద్ద టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణలో రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.రేవంత్‌కి అధ్యక్ష పదవి ఇచ్చినందుకు సోనియాగాంధీకి,రాహుల్‌గాంధీతో పాటు ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి రేవంత్‌రెడ్డి పక్షాన ధన్యవాదాలు తెలిపారు.జిల్లాకేంద్రంతో పాటు తుంగతుర్తి, కోదాడ,హుజూర్నగర్ నియోజకవర్గ ప్రాంతాల్లో కూడా ఆయన అభిమానులు వివిధ రూపాల్లో తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు ముదిరెడ్డి రమణారెడ్డి, షఫీఉల్లా, వెలుగువెంకన్న, పిల్లల రమేశ్‌నాయుడు, నామాప్రవీణ్, స్వామినాయుడు, ఫరూక్, వల్దాస్ దేవేందర్, పాలడుగు పరశురాం, బాలు, శ్రీధర్, కష్ణ, విజరురెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.