Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నతెలంగాణ-భూదాన్ పోచంపల్లి
వివాహిత అనుమానాస్పదస్థితిలో మతి చెందిన సంఘటన ఆదివారం మండలం లోని పెద్దగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వలిగొండ మండలం ముద్దాపురం గ్రామం చెందినపిన్నింటి లక్ష్మారెడ్డి, సత్య లక్ష్మి రెండో సంతానం రేణుకను (26)ఆరేండ్ల క్రితం పెద్దగూడెంకు చెందిన నోముల బాల్ రెడ్డితో వివాహం చేశారు. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు. అన్యోన్యంగా ఉండే వీరు శనివారం ఇంట్లో సెల్ ఫోన్ పగిలిపోయింది గొడవ జరిగింది. అదేవిషయంపై ఆదివారం ఉదయాన్నే ఇంట్లో చిన్న గొడవ జరిగింది. దీంతో రేణుక మనస్థాపానికి గురైబెడ్రూమ్లోకి వెళ్లి తలుపు వేసికుంది. భర్త బాల్రెడ్డ్డి బయటికి వెళ్లి తిరిగి వచ్చి చూసి తలుపు గట్టిగా కొట్టడంతో తెరుచుకోగానే ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారమందించాడు.
మతిపై అనుమానాలు
రేణుక మృతిచెందిన విషయం తెలియడంతో గ్రామస్తులు, చుట్టాలు పెద్ద ఎత్తున పెద్దగూడెంకి వచ్చారు. తన బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదని భర్త చంపాడని అనుమానాలున్నాయని తల్లిదండ్రులు ఆరోపించారు. పెద్ద ఎత్తున గొడవ జరగడంతో చౌటుప్పల్ ఏసీపీ శంకర్, టౌన్ సీఐ శ్రీనివాస్, రూరల్ సీఐ వెంకన్న వలిగొండ ఎస్సై రాఘవేందర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో తండ్రి లక్ష్మారెడ్డి తన బిడ్డ మతికి భర్త బాల్‌రెడ్డి కారణమంటూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.