Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరురూరల్
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియామకంతో కేసీఆర్కు కౌంట్ డౌన్ మొదలైందని ఆ పార్టీ ఆలేరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిగిరి విద్యాసాగర్ అన్నారు. ఆదివారం వారు నవతెలంగాణ విలేకరుతో మాట్లాడుతూ ఇక తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన స్వస్తి పలికే దిశగా తెలంగాణ ప్రజలను తెలంగాణ పేరు చెప్పి పొందిన అధికారాన్ని గద్దె దింపే నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు.
రామన్నపేట : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానం ఏఐసీసీి అధ్యక్షురాలు సోనియా గాంధీ, యువ నాయకులు రాహుల్ గాంధీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా అనుముల రేవంత్ రెడ్డిని నియమించడంతో ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుభాష్ సెంటర్లో టపాకాయలు కాల్చి స్వీట్లు పంపిణీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాల్వేరు అశోక్, ఎండి జమిరోద్ధిన్, బొడ్డు అల్లయ్య, మిర్యాల మల్లేష్, నాయకులు గంగాపురం ప్రవీణ్, గోపగోని సహదేవ, కల్లూరు నరేష్, బాసాని రాజు, బాలగోని గణేష్, బర్ల స్వామి మహమ్మద్ అరిఫ్, మన్సూర్ అలీ, రేపాక రమేష్, మాండ్ర నరేష్ బుల్లెట్, కల్లూరి శివ, పరశురాం, బోయపల్లి భరత్, అక్కంపల్లి ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
కేతెపల్లి : తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన అనుముల రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో జెడ్పీటీసీ స్వర్ణలత సురేష్ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు నర్మద నాగేశ్వరరావు ఎక్స్ జెడ్పీటీసీ జటంగి లక్ష్మమ్మ వెంకట్ నర్సయ్య మండల మాజీ అధ్యక్షుడు కోట పుల్లయ్య మండలఅధ్యక్షురాలు నకిరేకంటి మంగమ్మ గ్రామ శాఖ అధ్యక్షులు భయ్యా ముత్తయ్య. మల్లయ్య , కోట పూర్ణ , వెంకటేశ్వరరావు , .శ్రీనివాస్ , వీర మల్లయ్య, గణేష్ , సుధాకర్ , జాషువా పాల్గొన్నారు.