Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూర్
ఎస్సీ, ఎస్టీ డెవలప్మెంట్ ఫోరం యాదాద్రి జిల్లా నూతన కమిటీని ఆదివారం మోత్కూర్లో ఆ ఫోరమ్ రాష్ట్ర కమిటీ చైర్మెన్ చిప్పలపల్లి రమేష్, కో ఆర్డినేటర్ నార్కట్పల్లి హరిభూషన్ సమక్షంలో నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షునిగా చిప్పలపల్లి అంజయ్య, జిల్లా అధ్యక్షునిగా చెడిపెల్లి రఘుపతి, ఉపాధ్యక్షులుగా సలిగంజి విరస్వామి, నల్ల సాలయ్య, ప్రధాన కార్యదర్శిగా గుర్రం మహేందర్, సహాయ కార్యదర్శులుగా తొంట భాస్కర్, కదిరే నవీన్, అధికార ప్రతినిధిగా మందుల రాజు, కార్యనిర్వహణ అధికారిగా సూరారం భాస్కర్, కోశాధికారిగా మందుల కిరణ్, లీగల్ అడ్వయిజర్ గా పాలడుగు సురేష్, కార్యవర్గసభ్యులుగా కురిమేటి యాదయ్య, కూరెళ్ల రాజశేఖర్, పంగ రాజశేఖర్, కూరెళ్ళ వెంకన్న, పర్రెపాటి పరమేష్ ఎన్నికయ్యారు. అనంతరం రాష్ట్ర కమిటీ చైర్మెన్ చిప్పలపల్లి రమేష్, కోఆర్డినేటర్ నార్కట్ పల్లి హరిభూషన్ నూతన కార్యవర్గానికి నియామక పత్రం అందజేశారు.