Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోటకొండూర్: టీపీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఎనుముల రేవంత్ రెడ్డి నియామకంపై జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరబోయిన మల్లేష్ యాదవ్ వర్షం వ్యక్తం చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బాణాసంచాలు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వీసం వెంకటేశ్వర్లు ,నాయకులు భాస్కరుని రఘునాథ రాజు, చాడ ఎంపీటీసీ ప్రతిభ శశిధర్ రెడ్డి, వనం శ్రీధర్, శీల బాలకష్ణ, గడ్డం వెంకటేష్, వెంకట్ మల్లేష్ యాదవ్, భువనగిరి ఎల్లయ్య, పల్లె శ్రీనివాస్, పాండు, నాగరాజు, వంగపల్లి శ్రీను, జంపాల నాగచందర్, వంగవల్లి శ్రీనివాస్, బంగారి, శ్రీకాంత్, మహేష్, నవీన్ రెడ్డి,రేగు రమేష్, గడ్డం మహేష్ తదితరులు పాల్గొన్నారు.
మోత్కూర్: టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి, ఉపాధ్యక్షునిగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి నియామకం పట్ల మోత్కూర్లో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కార్యకర్తలు, నాయకులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు వంగాల సత్యనారాయణ, గుండగోని రామచంద్రు, జిల్లా నాయకులు డాక్టర్ జి.లక్ష్మీ నర్సింహా రెడ్డి, అవిశెట్టి అవిలిమల్లు, ఫైళ్ల సోమిరెడ్డి, నాయకులు పన్నాల శ్రీనివాస్ రెడ్డి, కారుపోతుల వెంకన్న, మందుల సురేష్, బద్దం నాగార్జున రెడ్డి, గుండు శ్రీను, ఎం.మల్లారెడ్డి, భిక్షం, ఎండి.ఆయాజ్, నర్సింహ, బి.సతీష్, బి.రవి, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.
అడ్డగూడూర్ : మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు పోలేబోయిన లింగయ్య యాదవ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్ , అడ్డగూడూరు మండల టౌన్ ప్రెసిడెంట్ గూడెపు పాండు, సింగిల్ విండో డైరెక్టర్ జిల్లా నాయకులు కొప్పుల నిరంజన్ రెడ్డి, జిల్లా నాయకులు రోడ్డ మల్లేష్, ఆయా గ్రామాల సర్పంచులు నారగోని అంజయ్య గౌడ్, నిమ్మనగోటి జోజి, కొప్పుల మోహన్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ కడారి శ్రీశైలం, సీనియర్ నాయకులు వల్లంబట్ల రవీందర్ రావు, బాలెంల సురేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు పోలేపాక అబ్బులు పాల్గొన్నారు.