Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెరవేరని లక్ష్యం
- ఈ పంచాయితీల్లో కనిపించని, పని చేయని కంప్యూటర్లు
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
లక్షలు వథా అయ్యాయే తప్ప ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఈ పంచాయతీలకు ఇచ్చిన కంప్యూటర్లు మాయమయ్యాయి. ఉన్నవి కొన్ని నిరుపయోగంగా మారాయి.
టీిఆర్ఎస్ ప్రభుత్వం మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు గ్రామ పంచాయతీలను పటిష్టం చేసేందుకు 2015లో ఈ పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారు. గ్రామ అభివద్ధికి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చే ప్రజాధనం సక్రమ పద్ధతిలో వినియోగించాలని ఈ పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పట్లో మండలంలో 14 గ్రామ పంచాయతీలు ఉండగా నారాయణపురం, చిమిర్యాల, లచ్చమ్మ గూడెం, పుట్టపాక, మహమ్మదాబాద్, రాచకొండ, సర్వేలు, వాయిలపల్లి, జనగాం, గుడిమల్కాపురం తదితర గ్రామ పంచాయతీలను ఈ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. ఒకొక్కో పంచాయతీకి సుమారు రూ.2లక్షలు వెచ్చించి కంప్యూటర్లు, ప్రింటర్లు తదితర మిషన్లు పంపిణీ చేశారు. వీటితో పాటు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీవోకు మరో కంప్యూటర్ ఇచ్చారు. ఆపరేటర్లను నియమించుకునే బాధ్యత ఆయా పంచాయతీలకే అప్పగించారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ ఇందులో పొందు పరచాలని సూచించారు. వీటితో పాటు ట్రేడ్ లైసెన్స్లు ఇవ్వాలని ఇంటి నిర్మాణాలకు అనుమతుల రూపంగా వచ్చే నిధులను, కొటేషన్, ఇంటి, నల్లా పన్నుల డబ్బులను ఎప్పటికప్పుడు ఈ పంచాయతీలో పొందుపరచాలని సూచించారు. ఈ గ్రామ స్వరాజ్యం కింద జమా ఖర్చులను నమోదు చేయాలని,జనన మరణాలు ధ్రువ పత్రాలను అందచేయాలని నిర్ణయించారు. అదేవిధంగా గ్రామ అభివద్ధి కోసం ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులను గ్రామ అభివద్ధికి ఖర్చు చేసినట్టయితే డ్రా చేసిన చెక్కులను, ఎంబి రికార్డును పొందుపరచాలని, ట్రాక్టర్ల ఈఎంఐ వివరాలతో పాటు ఉ గ్రామంలో రోజువారి జమా ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు ఈ ల్యాబ్లో పొందుపర్చాల్సి ఉంది. గ్రామ అభివద్ధి వివరాలన్ని ఆన్లైన్లో ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ఈ పంచాయతీ ఏర్పాటు చేసింది. కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శులు,సర్పంచులు, అధికారులు ఒక లక్ష్యాన్ని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. పన్నుల రూపకంగా వచ్చిన డబ్బులకు నేటికీ చేతిరాత ద్వారా రసీదులు ఇవ్వటం, గ్రామ అభివద్ధికి నిధులు దుర్వినియోగ పరచడం జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆయా గ్రామాలకు చెందిన వార్డుసభ్యులు, ఒక్క సర్పంచులు గ్రామాభివద్ధి నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు నకిలి రషీద్ ల ద్వారా ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్న కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన నామమాత్రపు విచారణలు,చర్యలు తీసుకుంటున్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ పంచాయతీలు ఉండగా ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించడంలో కలెక్టర్ సైతం విఫలమైనట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. జనన, మరణ ధవ పత్రాలను మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలు డబ్బులు చెల్లించి తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కంప్యూటర్ ఆపరేటర్లు లేనందున ప్రభుత్వం లక్షల రూపాయలు ఇచ్చిన కంప్యూటర్లు నేటికీ కొన్ని పంచాయతీల్లో నిరుపయోగంగా పడి ఉండగా మరికొన్ని పంచాయతీలో కనిపించకుండాపోయిన పరిస్థితి నెలకొందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీ వద్ద ఉన్న ఒక కంప్యూటర్తో పాటు మహమ్మదాబాద్కు చెందిన తీసుకొచ్చి ఇద్దరు ఆపరేటర్లను నియమించి అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన జమా ఖర్చుల వివరాలను సంవత్సరానికి ఒకసారి ఈ ల్యాబ్లో పెడుతున్న పరిస్థితి నెలకొందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని ఈ పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్లు నియమించి రోజువారి జమాఖర్చుల వివరాలను ఈ ల్యాబ్లో పొందుపరచాలని కోరుతున్నారు.