Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
జిల్లా కేంద్రగ్రంథాలయంలో పాఠకులు పెరుగుతున్న కొద్దీ ప్రస్తుతం ఉన్న గ్రంథాలయం సరిపోకపోవడంతో మూడేండ్ల కింద అప్పటి ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి నిధుల నుంచి అదనపు గ్రంథాలయ నిర్మాణం కోసం రూ.24 లక్షలు మంజూరు చేశారు.గ్రంథాలయ నిర్మాణానికి ఎంపీ నిధులు సరిపోక పోవడంతో ఏడాది నుండి నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపేశారు.భవన నిర్మాణపనులు పూర్తి చేయడానికి నిధులు లేకపోవడంతో గ్రంథాలయ భవనం నిరుప యోగంగా దర్శనమిస్తుంది.భవనం పూర్తి ాక ప్రారంభానికి నోచుకోకపోవడంతో ప్రస్తుత భవనంలో పాఠకుల తీవ్రఇబ్బందులు పడుతున్నారు.
కొత్త భవనాన్ని త్వరగా ప్రారంభించాలి:పాఠకులు
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతనంగా నిర్మిస్తున్న అదనపు పాఠకుల గ్రంథాలయాన్ని ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి.ప్రస్తుతం ఉన్న గ్రంథాలయం చిన్నగా ఉండడం, పాఠకుల సంఖ్య రోజురోజుకు పెరుగు తుండడంతో కరోనా దృష్ట్యా ఇబ్బందులు పడుతున్నాం.ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని గ్రంథాలయాన్ని ప్రారంభించాలి.
నెల లోపల ప్రారంభిస్తాం
గ్రంథాలయ కార్యదర్శి-బాలమ్మ
అదనపు గ్రంథాలయ నిర్మాణానికి ఎంపీ నిధుల నుండి రూ.24లక్షలు మంజూ రయ్యాయి.గ్రంథాలయ నిర్మాణం పూర్తి కావడానికి మొత్తం రూ.33లక్షలు ఖర్చవు తాయి.గది నిర్మాణం పూర్తయి మిగతాపనులు ఆగిపోయాయి.సీలింగ్, విద్యుత్,టాయిలెట్ల నిర్మాణానికి మరో రూ.9 లక్షలు అదనంగా ఖర్చవుతాయి.దీంతో భవనాన్ని పూర్తి చేయలేకపోయాం.ఈ విషయమై కలెక్టర్కు, మాజీ ఎంపీ గుత్తాసుఖేందర్రెడ్డికి ప్రతి పాదనలు పంపాం.భవనానికి త్వరలోనే నిధులు మంజూరు చేసుకొని నెలరోజుల్లో ప్రారంభిస్తాం.