Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగారం
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్టు కాంగ్రెస్ మండల నాయకులు పొదిల నరేష్‌గౌడ్ అన్నారు.ఆదివారం మండలంలోని పసునూరు గ్రామంలో బాణాసంచా పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు.అనంతరం మాట్లాడుతూ 2023లో రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు.అదేవిధంగా టీపీసీసీ ఉపాధ్యక్షులుగా నియామకమైన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు పంది శ్రీనివాస్, మామిడి సుదర్శన్, కనకం ఎల్లయ్య, ఫత్తేపురం రవి మామిడి, సాయిలు పాల్గొన్నారు.
కోదాడరూరల్ : రేవంత్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షునిగా నియామకం కావడం పట్ల ఆ పార్టీ సీనియర్ నాయకులు, పీఏసీఎస్ డైరెక్టర్ ఓరుగంటి శ్రీనివాస్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఇద్దరి నేతల నాయకత్వంలో ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతూ టీఆర్ఎస్ నియంత ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కోరారు.
సూర్యాపేటరూరల్ : వచ్చే శాసనసభఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రానున్నదని ఆ పార్టీ నాయకులు గట్టు శ్రీనివాస్ అన్నారు.తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్‌రెడ్డి నియామకమైన సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో బాణా సంచా కాల్చి,ర్యాలీతో ఎండ్లపల్లి, టేకుమట్ల గ్రామం నుండి 100 బైకులతో పటేల్ రమేశ్‌రెడ్డి ఇంటికి చేరుకొని అక్కడి నుండి పట్టణంలో భారీర్యాలీతో మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సుంకరి లక్ష్మీనారాయణ, చింతల కేశవులు, యుగేందర్, పోకలవరుణ్, శంకర్, ప్రభాకర్ పాల్గొన్నారు.
దేవరకొండ:నూతనంగా ఎన్నికైన టీ.పీసీసీ అధ్యక్షులు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి,ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఆయన వెంట కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు, టీపీసీసీ అధికార ప్రతినిధి సిరాజ్‌ఖాన్, జెడ్పీటీసీ శోభారాణి, ఏవీరెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ జాల నర్సింహారెడ్డి, మాధవరెడ్డి, మార్కెట్ మాజీ చైర్మెన్ ముక్కాముల వెంకటయ్యగౌడ్, సర్పంచుల ఫోరం మహిళా అధ్యక్షురాలు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలలక్ష్మీ నారా యణగౌడ్, మండల అధ్యక్షులు లోకసాని శ్రీధర్ రెడ్డి, లోకసాని కష్ణయ్య, నల్లవెల్లి రాజేష్‌రెడ్డి, నాగేశ్వర్ రావునాయక్, ఎల్లయ్య, చింతపల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింహారెడ్డి,మేడారం అంజయ్య పాల్గొన్నారు.
మిర్యాలగూడ :టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డిని నియమించడం పట్ల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రాజీవ్‌భవన్‌లో నిర్వహించిన సమావేశంలో టీపీసీసీ సభ్యులు చిరుమర్రి కష్ణయ్య మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి నియామకం కాంగ్రెస్‌కు శుభపరిణామమన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ విజయం తథ్యమన్నారు. బడుగు, బలహీన వర్గాల పట్ల స్పందించే వ్యక్తి రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివద్ధికి, ముందుండి నడిపించే నాయకుడు రేవంత్‌రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింగ్ వెంకటేశ్వర్లు, ఓబీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు శ్రీనివాస్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు పోలగాని వెంకటేశ్, ఎంపీటీసీ తలకొప్పుల సైదులు, పట్టణ వర్కింగ్ అధ్యక్షులు ఎంఏ.సలీం, పి.బాబురావునాయక్, ఎస్కె.అబ్దుల్లా, కొండ జోషి, విష్ణు, నీరుకంటి నారాయణ పాల్గొన్నారు.
మర్రిగూడ : మండలకేంద్రంలోని చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచి సంబురాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ పాల్వాయి అనిల్‌రెడ్డి, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు పొనుగోటి విజయ రామా రావు, సర్పంచులు కుంభంశ్రీనివాసరెడ్డి, మార్నేని లూర్ధయ్య, బిచ్యానాయక్, కొర్ర శ్రీను, నక్క తిరుపతయ్య పాల్గొన్నారు.