Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండూరు: గుండ్రపల్లి గ్రామానికి చెందిన మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన తిరుమని కొండల్ కుటుంబాన్ని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్ పరామర్శించి రూ.20,000 ఆర్థిక సాయం అందజేశారు. టీఆర్ఎస్ గుండ్రపల్లి మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన అనుమల్ల సత్యనారాయణ కుటుంబానికి రూ.5,000వేలు, కురుపాటి కుమార్ కుటుంబానికి రూ.3,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తీగల శుభాస్,గంజి వెంకటేశం, గండూరి జనార్దన్, కురుపాటి సైదులు, బొమ్మరబోయిన రాజు, కట్కూరి వెంకట్ రెడ్డి, దొంతరగొని వెంకటేష్,పర్వతపు శివ,సోము రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.