Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో అతి తక్కువ చార్జీలతో రవాణా సదుపాయాన్ని కల్పిస్తూ ప్యాసింజర్ రైళ్లు త్వరలో పట్టాలు ఎక్కనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన నగరాలైన హైదరాబాద్. ఆలయారు పట్టణ కలుపుతూ వరంగల్ మధ్యలో ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు కేంద్ర రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అందుబాటులోకి తేనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది .తెలంగాణ రాష్ట్రం లాకు డవును ఎత్తి వేయడంతో సౌత్ సెంట్రల్ రైల్వే 100 ఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు సిద్ధమవుతోంది. ప్యాసింజర్ రైలు తిరిగి ప్రారంభమైనట్టయితే లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుంది. ప్యాసింజర్ రైలు ప్రారంభమైతే లక్షలాది మందికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.