Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాతలు ముందుకు రావాలి
- సూర్యాపేట కలెక్టర్ వినరుకష్ణారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లా కరోనా బాధితులకు అండగా దాతలు, స్వచ్ఛంద సంస్థలు తమవంతు సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ టి.వినరుకష్ణారెడ్డి అన్నారు.సోమవారం కలెక్టరేట్ నందు స్వేరోస్ సంస్థ అధ్వర్యంలో జిల్లాలో కరోనా బాధితులకు ఒక కాన్సంట్రేటర్,30 ఆక్సిమీటర్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు.జిల్లాలో సేవలు అందిస్తున్న స్వేరోస్ సంస్థను అభినందించారు.అనంతరం సంస్థ కమ్యూనిటీ రిలేషన్ అధికారి కె.నిర్మల మాట్లాడుతూ రాష్ట్ర యస్.సి, యస్.టి గురుకులాల కార్యదర్శి డా. ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలో కరోనా బాధితులకు సంస్థ ద్వారా సేవలు అందించడం జరుగుతుందని కలెక్టరేట్ నందు కలెక్టర్ టి.వినరుకష్ణారెడ్డి చేతుల మీదుగా ఒక కాన్సంట్రేటర్, 30 పల్స్ అక్సిమీటర్ల ను ప్రారంభించామన్నారు.జిల్లాలో కరోనా బాధితులకు తమ సంస్థ ద్వారా సేవలు అందించడం జరుగుతుందని, కరోనా భాదిత కుటుంబ సభ్యులు 9502646553 కు సంప్రదించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ కోటాచలం, పీడీ కిరణ్కుమార్, రాష్ట్ర అధ్యక్షురాలు పి.శోభారాణి, బి.దుర్గయ్య, కమిటీ సభ్యులు దశరథ, రవి, మచ్చనర్సయ్య, వీరస్వామి, ఆర్సీఓ అరుణకుమారి పాల్గొన్నారు.