Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ
నవతెలంగాణ-నల్లగొండ
పట్టణ ప్రాంతాలలో పరిశుభ్రత, పచ్చదనంతో పాటు ప్రజల అవసరాలు గుర్తించి అభివద్ధి చేసేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు.సోమవారం మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు.జులై ఒకటి నుండి 10 వరకు నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమంపై పలు సూచనలు చేశారు.మూడవ విడత జులై ఒకటి నుండి నిర్వహించనున్న పట్టణ ప్రగతి లో మున్సిపాలిటీలో ప్రతివార్డును ఒకయూనిట్గా తీసుకోవాలన్నారు. కౌన్సిలర్లతో,వార్డు పర్యవేక్షణ అధికారి,మున్సిపల్ పారిశుధ్యసిబ్బంది, మంచినీటి సరఫరా ఉద్యోగితో వార్డుకమిటీలు ఏర్పాటుచేయాలన్నారు.మొదటి రోజు వార్డుసభ, వార్డు కమిటీ సభ్యులు ఎన్నికైన వార్డు సభ్యులు కౌన్సిలర్లతో నిర్వహించాలన్నారు.ప్రత్యేకవార్డుకమిటీలు యువత, మహిళలు, సీనియర్ సిటిజన్లు,పురప్రముఖులతో ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులు ఉండాలన్నారు.ప్రజలకు పట్టణప్రగతి లక్ష్యాలు, చేపట్టిన ప్రగతి వివరిస్తూ ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు.ప్రజల అభిప్రాభియాలు, సలహాలు స్వీకరించి వార్డు అభివద్ధికి 10 రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు గుర్తించా లన్నారు. అందులో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యులను చేయాల న్నారు.పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసు కోవాలన్నారు.పిచ్చిమొక్కలు తొలగించాలని,ప్రతి రోజు చెత్త తరలింపు చేయాల న్నారు.మంచినీటి సరఫరా రోజూ వారీగా ఉండాలన్నారు. హరితహారంలో ఎవెన్యూ, మీడియాన్, ఇనిస్టిట్యూషనల్ ప్లాంటేషన్ చేపట్టాలని,ట్రీపార్క్లు ఏర్పాటు చేయాల న్నారు.ప్రతి మున్సిపాల్టీ లో 5 నుండి 10 ఎకరాల స్థలంలో బహత్ ప్రకతివనం ఏర్పాటు చేయాలని,స్థలం లేకుంటే 1 నుండి 5 ఎకరాల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఘన వ్యర్థపదార్థాల నిర్వహణ చేయా లని,తడి,పొడి చెత్త వేరు చేసేలా కంపోస్టు షెడ్, డ్రై రీసోర్స్సెంటర్ల నిర్వహణ ఏర్పాటు చేసుకోవాలని,తడి చెత్త నుండి వర్మీ కంపోస్టు, విండ్ రో ఎరువు తయారు చేయాలన్నారు.వెజ్,నాన్‌వెజ్ మార్కెట్ల ఏర్పాటు టెండర్ల ఒప్పందం పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు.ఓపెన్ బావులు,పని చేయని బోర్ వేల్స్ మూసి వేయాలని ఆదేశించారు.విద్యుత్ సమస్యలు, వైకుంఠదామాల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.